ETV Bharat / snippets

బఫర్​జోన్​లో అనురాగ్ కాలేజీల నిర్మాణం - పల్లా రాజేశ్వర్​రెడ్డిపై కేసు నమోదు

CASE REGISTERED ON BRS MLA PALLA
Case book on Palla Rajeshwar Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 5:14 PM IST

Updated : Aug 24, 2024, 7:17 PM IST

Case book on Palla Rajeshwar Reddy : చెరువు బఫర్‌జోన్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. చెరువు బఫర్‌జోన్‌లో సుమారు ఎకరంన్నర భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్‌స్టిట్యూషన్‌కు సంబంధించిన అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని నీటిపారుదలశాఖ ఏఈ పరమేష్‌, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు ఈ కేసుపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పందించారు. తన విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అన్ని అనుమతులతోనే నిర్మాణాలు చేస్తున్నామని, 25 ఏళ్లలో ఎప్పుడూ అనుమతులు లేకుండా నిర్మించలేదని తెలిపారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించినా చట్టప్రకారమే వెళ్తానని, చట్టపరిధిలో న్యాయం కోసం పోరాడతానని స్పష్టం చేశారు.

Last Updated : Aug 24, 2024, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.