KTR On BRS Fact Finding Committee : గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన వైద్య ఆరోగ్య పరిస్థితుల పతనంపై అధ్యయనం కోసం భారత రాష్ట్ర సమితి నిజనిర్ధారణ, అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో కమిటీని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. డాక్టర్ రాజయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కమిటీ గాంధీ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులపై బీఆర్‌ఎస్ నిజనిర్ధారణ కమిటీ
Published : Sep 20, 2024, 7:57 PM IST