KTR Comments On Minister Ponguleti : అమృత్ టెండర్లలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని ప్రభుత్వం నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఇదే అంశానికి సంబంధించి మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై తెలంగాణ భవన్లో స్పందించిన కేటీఆర్ హైకోర్ట్ సీజే లేదంటే దిల్లీలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరకు తాను వచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ అంశంపై సీవీసీ వద్దకు ఎప్పుడు వెళ్దాం అనేదానిపై తేదీని పొంగులేటి ఖరారు చేసి చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారని మండిపడ్డ కేటీఆర్ ఇప్పటికైనా తప్పును దిద్దుకుని టెండర్‌ను నిలిపివేయాలన్నారు. లేకపోతే ఈ విషయంలో మంత్రితోపాటు సీఎం సైతం రాజీనామా చేయాల్సి రావచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రజలను , న్యాయస్థానాలను సైతం మోసం చేస్తోందని తప్పుడు సమాచారం ఇస్తోందని ధ్వజమెత్తారు.
ఆ టెండర్లలో అవినీతి జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా : కేటీఆర్
Published : Sep 22, 2024, 4:54 PM IST