ETV Bharat / snippets

మమ్మల్ని ఆదుకోండి సారూ - బండి సంజయ్​కు బీడీ కార్మికుల విజ్ఞప్తి

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 5:28 PM IST

Updated : Aug 31, 2024, 8:19 PM IST

Central minister Bandi sanjay
BANDI SANJAY IN KARIMNAGAR (ETV Bharat)

ప్రభుత్వ పథకాల కేటాయింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అన్యాయం చేశాయని కరీంనగర్​ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​కు బీడీ కార్మికులు మొరపెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ గతంలో పలుమార్లు ఢిల్లీకి, హైదరాబాద్​కు వెళ్లి మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదని వారు బండి సంజయ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ ముద్దుబిడ్డగా తమను ఆదుకోవాలని మహిళలు మంత్రికి విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్​ నగరంలో ఇవాళ తన పర్యటనలో మంత్రి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ఎంపీ లాడ్స్​ నిధులతో నిర్మించే పనులకు భూమిపూజ చేశారు. కొత్తపల్లి మండల చెరువు వద్ద రూ.2 కోట్ల 65 లక్షలతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జ్​ను మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 13, 28 డివిజన్లలో పలు సంఘాల కమ్యూనిటీ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.

Last Updated : Aug 31, 2024, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.