ETV Bharat / snippets

కొండగట్టు అంజన్నకు మొక్కు - శనివారం దర్శించుకోనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 12:36 PM IST

AP Deputy CM Pawan Kalyan To Visit Kondagattu
AP Deputy CM Pawan Kalyan To Visit Kondagattu (ETV Bharat)

AP Deputy CM Pawan Kalyan To Visit Kondagattu : జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారిని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం దర్శించుకోనున్నారు. ఎన్నికల ముందు వారాహి వాహన పూజ నిర్వహించి అంజన్నకు ముడుపులు కట్టారు. ఎన్నికల తర్వాత ఆయన మొక్కులు తీర్చుకునేందుకు కొండగట్టు అంజన్న సన్నిధికి రానున్నారు.

శనివారం ఉందయం 11 గంటలకు కొండగట్టు చేరుకుని, అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారు. పూజల అనంతరం 12.30 గంటలకు కొండగట్టు నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. పవన్‌ కల్యాణ్ వస్తున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యటన నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు చేరుకునే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.