AP Deputy CM Pawan Kalyan Buys Land in Pithapuram : జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు ప్రారంభించారు. బుధవారం రోజున అక్కడే స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు బిట్లు తీసుకున్నారు. ఇందుకు సంబందించి బుధవారం మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్యలో పవన్ పేరున రిజిస్ట్రేషన్ పూర్తయింది.
ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు కోసం కాగా మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని, పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని ఎన్నికల బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ రూ.15-16 లక్షలవరకు ఉంటుంది. జనసేన నేతలు మరో పదెకరాల తోటలు కొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.