ETV Bharat / snippets

గొర్రెల పంపిణీ స్కామ్ అప్​డేట్ - ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 12:37 PM IST

Telangana Sheep Distribution Scam Latest News
Telangana Sheep Distribution Scam Latest News (ETV Bharat)

Telangana Sheep Distribution Scam Latest News : గొర్రెల పంపిణీ పథకం కేసులో ఇద్దరు నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. పశుసంవర్ధకశాఖ మాజీ సీఈవో రాంచందర్​ నాయక్​, మాజీ ఓఎస్డీ కల్యాణ్​కుమార్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించనున్నారు. వీరిద్దరినీ 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో అధికారులు వారిని చంచల్​గూడ జైలు నుంచి బంజారాహిల్స్​లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. వీరిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో రూ.700 కోట్ల అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్లు సమాచారం. బినామీ పేర్లతో బిల్లులను విత్​డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో అధికారులు ఇప్పటికే సుమారు 10 మంది నిందితులను గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.