ETV Bharat / snippets

అందరినీ చంపుతానంటూ తిరిగి - చివరకు వృద్ధుడిని బలి తీసుకుని

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 11:51 AM IST

A Old Man Murder in Mahabubabad
A Old Man Murder in Mahabubabad (ETV Bharat)

A Old Man Murder in Mahabubabad : రెండు రోజుల నుంచి అందరినీ చంపుతానంటూ గ్రామంలో తిరిగిన ఓ వ్యక్తి, చివరకు వృద్ధుడిని బలి తీసుకున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో జరిగిన ఈ ఘటనలో యాకయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి రెండు రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తూ తిరుగుతున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఈ క్రమంలో బహిర్భూమికి వెళ్తున్న యాకయ్యను మంచం పట్టెతో కొట్టి చంపాడు. వెంటనే గ్రామస్థులు రాజును పట్టుకుని చెట్టుకు కట్టేశారు. నెల్లికుదురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.