Ameenpur Women Suicide : ఓ మహిళ భర్తతో విడాకులు తీసుకునేందుకు పరస్పర ఒప్పందం కుదుర్చుకుని పుట్టింటి వద్దే ఉంటుంది. మామ చనిపోతే కార్యక్రమానికి వచ్చింది. త్వరలో విడిపోబోయే భర్తతో కలిసి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు వద్దకు వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే, ఏపీకి చెందిన రవితేజ, ఆమె భార్య జయశ్రీ. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో నివాసం ఉండేవారు. వీరికి నాలుగేళ్ల పాప కూడా ఉంది.
అయితే వీరి మధ్య విభేదాలు రావడంతో మూడేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకునేందుకు పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా భర్త, కూతురుతో కలిసి అమీన్పూర్ పెద్ద చెరువు చూస్తానంటూ కలిసి వచ్చి, ఎవరూ చూడని సమయంలో చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రేటర్ విపత్తుల బృందం వచ్చి గాలించి మృతదేహాన్ని బయటికి తీశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.