ETV Bharat / snippets

వరంగల్​లో ట్రాక్టర్ రోటావేటర్​లో పడి బాలుడు మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 4:34 PM IST

A Boy Died in Tractor Rotavator
A Boy Died Fell Into Tractor Rotavator In Warangal (ETV Bharat)

A Boy Died Fell Into Tractor Rotavator In Warangal : వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నల్లబెల్లి మండలంలోని గోవిందాపురంలో ట్రాక్టర్ రోటావేటర్​లో పడి ఓ బాలుడు మృతి చెందాడు. నల్లబెల్లి మండలం గోవిందాపురం శివారు లైన్ తండాకు చెందిన గుగులోతు ఏసు, రాజు దంపతుల కుమారుడు బాలు తల్లిదండ్రులతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు.

బాలు తండ్రి పత్తి విత్తనాలు నాటేందుకు రోటావేటర్​తో పొలం చదును చేస్తున్నాడు. తండ్రి రాజుకు మంచినీళ్లు అందించిన బాలుడు ట్రాక్టర్​పైన కూర్చున్నాడు. మంచి నీరు తాగిన తండ్రి మళ్లీ ట్రాక్టర్​ నడుపుతుండగా బాలుడు ప్రమాదవశాత్తు టాక్టర్‌ రోటావేటర్​లో పడిపోయాడు. గమనించిన రాజు ట్రాక్టర్ ఆపి చూసే సరికి బాలుడు రోటావేటర్​లో పడి నుజ్జు నుజ్జు అయ్యాడు. ఇంకో రెండు రోజులు అయితే పాఠశాలకు వెళ్లే తన కుమారుడు కళ్ల ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లాడని రోదించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.