ETV Bharat / snippets

యశస్వి అరుదైన ఘనత- తొలి బ్యాటర్​గా రికార్డ్

Yashasvi Jaiswal 2024
Yashasvi Jaiswal 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 3:45 PM IST

Yashasvi Jaiswal 2024: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ మరో ఘనత సాధించాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్​లో 1000 పరుగుల మార్క్ అందుకున్న తొలి బ్యాటర్​గా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్​లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్​లో జైశ్వాల్ ఈ మైలురాయి అందుకున్నాడు. కాగా, ప్రస్తుత క్యాలెండర్ ఇయర్​ (2024)లో జైశ్వాల్ ఇప్పటివరకు 63.93 సగటుతో 1023 పరుగుల బాదాడు. అందులో రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే జైశ్వాల్ ఈ మొత్తం పరుగులు టెస్టు (740), టీ20 (283)ల్లోనే సాధించడం విశేషం. అతడు ఇప్పటివరకు వన్డే అరంగేట్రం చేయలేదు.

ఇక శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండీస్ (888 పరుగులు), అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీమ్ జర్దాన్ (844 పరుగులు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.