WFI On Vinesh Disqualification: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై భారత రెజ్లింగ్ సమాఖ్య తాజాగా స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి బాధ్యత కోచ్, సహాయక సిబ్బందిదే అని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ అన్నారు. 'వినేశ్ అదనపు బరువు విషయమై ఉదయం ఫోన్ వచ్చింది. వినేశ్‌కు కొంత సమయం, సడలింపు ఇవ్వాలని అధికారులను అభ్యర్థించాను. కానీ వాళ్లు తిరస్కరించారు. ఇప్పటికే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్‌తో మాట్లాడాను. ఈ వ్యవహారంలో వినేశ్ తప్పు చేసినట్లు భావించడం లేదు. మొత్తం బాధ్యత ఆమె కోచ్, సహాయక సిబ్బందిపై ఉంది. ఆమె బరువు ఎలా పెరిగిందనే దానిపై విచారణ జరగాలి. కోచ్, సహాయక సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా' అని సంజయ్ సింగ్ అన్నారు. కాగా, 50కేజీల ఈవెంట్లో వినేశ్ 100గ్రామలు అధిక బరువు ఉండటం వల్ల వేటు పడింది.
'వినేశ్ వెయిట్ ఎక్కువుందని WFIకి ముందే తెలుసు'- తప్పంతా కోచ్&స్టాఫ్‌దే!
Published : Aug 7, 2024, 5:08 PM IST