Vinesh Phogat Appeal: పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో తనపై అనర్హతను సవాలు చేస్తూ భారత అథ్లెట్ వినేశ్ ఫొగాట్ చేసిన అభ్యర్థనపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) విచారణ చేపట్టింది. ఒలింపిక్స్ క్రీడలు ముగిసే లోగా ఆర్బిట్రేషన్ దీనిపై తుది నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.
కాగా, అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన వినేశ్ ఫొగాట్ తనకు రజత పతకం ఇవ్వాలని అప్పీలులో కోరింది. ఒలింపిక్స్‌లో నిబంధనలను మార్చే అవకాశం లేదని యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ స్పష్టం చేసింది. ఒకవేళ ఆర్బిట్రేషన్ అనుమతి ఇస్తే వినేశ్‌కు సిల్వర్ మెడల్ దక్కే ఛాన్స్ ఉంది. దీంతో కాస్ ఏ తీర్పు ఇస్తుందా అని భారత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.