Venkatesh Iyer Marriage : టీమ్ ఇండియా యంగ్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు శ్రుతి రంగనాథన్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. బంధుమిత్రులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటో ఒకటి నెట్టింట ట్రెండ్ అవ్వగా, అభిమానులు, పలువురు క్రికెటర్లు ఈ కొత్త జంటకు కంగ్రాజ్యులేషన్స్ తెలుపుతున్నారు. సో క్యూట్ జంట అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక వెంకటేశ్ అయ్యర్ భారత్ తరఫున 9 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌లోనూ ఈ యంగ్ హీరో అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకటేశ్ ఇప్పటివరకు 50 మ్యాచులు ఆడి 1326 పరుగులు స్కోర్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం.