ETV Bharat / snippets

యూఎస్‌ ఓపెన్‌లో మరో సంచలనం - జకోవిచ్‌ ఔట్

author img

By ETV Bharat Sports Team

Published : Aug 31, 2024, 10:18 AM IST

source Associated Press
US Open 2024 Novak Djokovic (source Associated Press)

US Open 2024 Novak Djokovic : యూఎస్‌ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. డిఫెండిగ్ ఛాంపియన్ నోవాక్ జకోవిచ్ మూడో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. 28వ సీడ్ అలెక్సీ పాపిరిన్‌పై 4-6, 4-6, 6-2, 4-6 తేడాతో ఓటమి చెందాడు. దీంతో 25 గ్రాండ్ స్లామ్‌ టైటిళ్లతో చరిత్ర సృష్టించాలనుకున్న జకోవిచ్‌కు నిరాశే ఎదురైంది. రీసెంట్​గా ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన జకోవిచ్‌కు 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ ఊరిస్తోంది. అంతకుముందు యూఎస్ ఓపెన్‌లో అంచనాలు రేపిన ప్రపంచ మూడో ర్యాంకర్‌, స్పెయిన్‌ యంగ్ ప్లేయర్​ కార్లోస్‌ అల్కరాజ్‌ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. 74వ ర్యాంకర్‌, నెదర్లాండ్స్‌ ఆటగాడు బోటిక్‌ వాన్‌డితో జరిగిన మ్యాచ్‌లో 1-6, 5-7, 4-6 తేడాతో వరుస గేమ్‌ల్లో అల్కరాజ్‌ ఓటమి పాలయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.