Virat World Cup Records: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత ఖాతాలో వేసుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో శనివారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విరాట్ 37 పరుగులు బాదాడు. ఈ క్రమంలో ఐసీసీ వరల్డ్‌కప్ (టీ20, వన్డే)ల్లో కలిపి 3000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. విరాట్ కెరీర్లో రెండు వరల్డ్‌కప్‌ల్లో కలిపి 69మ్యాచ్‌లు ఆడగా 61.26 సగటుతో 3002 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ లిస్ట్‌లో విరాట్ తర్వాతి స్థానంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 69మ్యాచ్‌ల్లో 2637 పరుగులు చేశాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో 32 మ్యాచ్‌ల్లో విరాట్ 1207 పరుగులు చేయాగా, వన్డే వరల్డ్‌కప్‌లో 37 మ్యాచ్‌ల్లో 1795 పరుగులు సాధించాడు. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో వరుసగా విఫలమౌతున్న విరాట్ బంగ్లాతో మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చాడు. 37 పరుగులతో రాణించాడు.