ETV Bharat / snippets

'ట్రోఫీ​ కమింగ్ హోమ్- టీమ్ఇండియాకు గ్రాండ్ వెల్​కమ్ ప్లాన్'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 9:31 AM IST

Team India Coming
Team India Coming (Source: Associated Press)

Team India Coming: వరల్డ్​కప్ విజేత టీమ్ఇండియా జట్టు బర్బడోస్ నుంచి బుధవారం స్వదేశానికి బయల్దేరింది. సుమారు 16గంటల జర్నీ తర్వాత గురువారం ఉదయం 6.00 గంటలకు టీమ్ఇండియా ప్లేయర్లు దిల్లీ ఎయిర్​ పోర్టుకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'ఇట్స్​ కమింగ్ హోమ్' అంటూ వరల్డ్​కప్​ ట్రోఫీ ఉన్న వీడియోను బీసీసీఐ తాజాగా ట్విట్టర్​లో షేర్ చేసింది.

ప్రపంచకప్ విజేతలకు గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అభిమానులు కూడా రేపు ఉదయాన్నే పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకు చేరుకునే ఛాన్స్ ఉంది. దిల్లీకి చేరుకున్నాక టీమ్ఇండియా ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా, జూన్ 29న బర్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో నెగ్గిన టీమ్ఇండియా టోర్నీ ఛాంపియన్​గా నిలిచి, దాదాపు 11ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. దీంతో యావత్ భారతదేశ క్రీడభిమానులు గత 4రోజుల నుంచి సంబరాలు చేసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.