ETV Bharat / snippets

విరాట్ అరుదైన ఘనత- టాప్ 2 అథ్లెట్​గా కోహ్లీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 7:58 PM IST

VIrat Followers
VIrat Followers (Source: Getty Images)

Virat Kohli Twitter Followers: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ ఎక్స్​ (ట్విట్టర్​)లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన రెండో అథ్లెట్​గా నిలిచాడు. ఈ క్రమంలో బ్రెజిల్ స్టార్ ఫుట్​బాల్ ఆటగాడు నెయ్​మర్ జూనియర్​ను విరాట్ అధిగమించాడు. ప్రస్తుతం విరాట్​కు ట్విట్టర్​లో 63.5 మిలియన్ ఫాలోవర్లు ఉండగా, నెయ్​మర్​కు 63.4 మిలియన్ మంది ఉన్నారు. ఇక ఈ లిస్ట్​లో పోర్చుగల్ స్టార్ ఫుట్​బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డొ ఆగ్రస్థానంలో ఉన్నాడు. రొనాల్డొను 111.4 మిలియన్ యూజర్లు ట్విట్టర్​లో ఫాలో అవుతున్నారు. కాగా, ఇన్​స్టాగ్రామ్​లో విరాట్​కు 269 మిలియన్ ఫాలోవర్లు ఉండగా, రొనాల్డొకు 631 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.