ETV Bharat / snippets

చీటింగ్ చేయడంపై స్పందించిన గుల్బాదిన్ నైబ్! - ఏమన్నాడంటే?

Source The Associated Press
Gulbadin Naib (Source The Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 7:20 AM IST

Updated : Jun 26, 2024, 8:44 AM IST

T20 Worldcup 2024 Gulbadin Naib Cheating : టీ20 వరల్డ్​కప్​ 2024 సూపర్ 8 బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోరులో అఫ్గాన్​ ప్లేయర్ గుల్బాదిన్ నైబ్ గాయపడినట్లు డ్రామా చేసి దొరికిపోయాడు! కోచ్ సూచనలతో మ్యాచ్ సమయాన్ని వృథా చేయాలనే ఉద్దేశ్యంతో తొడ కండరాల గాయమైనట్లు డ్రామా ఆడాడు. దీంతో మాజీలు, క్రికెట్ ప్రియులు అతడిపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై స్పందించాడు గుల్బాదిన్. 'కొంచెం ఇష్టం. కొంచెం కష్టం. అప్పుడప్పుడు అలా జరిగిపోతుంది' అంటూ ట్వీట్​ చేశాడు. దీంతో మరోసారి అందరూ అతడిని విమర్శిస్తున్నారు. కాగా, ఈ పోరులో అఫ్గానిస్థాన్​​ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 8 పరుగుల తేడాతో గెలుపొందింది. టోర్నీ చరిత్రలో తొలిసారి సెమీస్​కు అర్హత సాధించింది. తొలి సెమీఫైనల్​లో సౌతాఫ్రికాతో జూన్​ 27న తలపడనుంది.

Last Updated : Jun 26, 2024, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.