ETV Bharat / snippets

పారాలింపిక్స్​లో భారత్ జోరు- ఖాతాలో మరో పతకం

author img

By ETV Bharat Sports Team

Published : Aug 31, 2024, 7:08 PM IST

Paris Paralympics
Paris Paralympics (Source: Getty Images)

Paris Paralympics India: పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌ పారా అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శనివారం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళా షూటర్‌ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యం ముద్దాడింది. 10మీ ఎయిర్‌ పిస్టల్‌ SH1 ఫైనల్‌లో 211.1 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో ప్రస్తుత పారాలింపిక్స్​లో భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది. శుక్రవారం భారత్ నాలుగు పతకాలు సాధించింది. అవని లెఖరా (స్వర్ణం ), మనీశ్ నర్వాల్ (రజతం), మోనా అగర్వాల్ (కాంస్యం), ప్రీతి పాల్ (కాంస్యం) దక్కించుకున్నారు.

మరోవైపు, బ్యాడ్మింటన్‌లో భారత్‌కు కాంస్య పతకం ఖాయమైంది. పురుషుల సింగిల్స్ SL-4 ఈవెంట్‌లో సుకాంత్ కదమ్, సుహాస్ యతిరాజ్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.