ETV Bharat / snippets

దిల్లీ వీడనున్న పంత్ - ఆ స్టార్ ప్లేయర్​ కూడా అదే బాటలో!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 10:21 AM IST

EtRishabh Pant IPL
Rishabh Pant (Getty Images)

Rishabh Pant IPL : స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ కెరీర్​లో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ​ఇప్పటి వరకూ దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పంత్‌, రానున్న సీజన్​లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మారనున్నట్లు సమాచారం. మరో షాకింగ్ విషయం ఏంటంటే అతడ్ని ధోని స్థానంలోకి భర్తీ చేయాలని చెన్నై చూస్తోందట.

గతంలోనే ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అటువంటిదేం జరగలేదు. కానీ ఈ సారి మాత్రం ఈ విషయంపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు ధోని ఆడతాడో లేదో కానీ పంత్‌ మాత్రం సీఎస్‌కేతో కలవడం ఖాయమని సమాచారం. ఇక లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా ఆర్సీబీలో చేరనున్నాడట. ప్రస్తుతం ఇవి రూమర్స్​గానే ఉన్నప్పటికీ, వీటిపై త్వరలో అధికారిక సమాచారం రానుందని టాక్ నడుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.