Neeraj Chopra Arshad Nadeem Prize Money : భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్(89.45 మీటర్లు) సాధించగా పాకిస్థాన్‌కు చెందిన నదీమ్ అర్షద్ స్వర్ణం దక్కించుకున్నాడు. దీంతో వీరికి ప్రైజ్‌మనీ ఎంతిస్తారనే సందేహం కొందరిలో కలుగుతోంది. అయితే ఐఓఏ మెడల్ విన్నర్స్‌కు ఎటువంటి ప్రైజ్‌మనీ ఇవ్వదు. టోక్యో ఒలింపిక్స్ వరకూ అథ్లెటిక్స్‌లోనూ ఎలాంటి మానిటరీ రివార్డును ఇవ్వలేదు.
కానీ ఈ సారి మాత్రం వరల్డ్ అథ్లెటిక్స్ గోల్డ్ విన్నర్స్‌కు ప్రైజ్‌మనీని అందించనుంది. ఈ లెక్కన నదీమ్ 50వేల యూఎస్ డాలర్లను అందుకోనున్నాడు. భారత కరెన్సీ ప్రకారం రూ.41,98,500. రజత పతకం సాధించిన నీరజ్‌కు ప్రస్తుతం ఎలాంటి ప్రైజ్‌మనీ లేదు. ఎందుకంటే ఈ ఒలింపిక్స్‌లో కేవలం బంగారు పతక విజేతలకు మాత్రమే ప్రైజ్‌మనీని ప్రకటించింది. అయితే, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ నుంచి మాత్రం రజతం, కాంస్య పతక విజేతలకూ నగదు బహుమతిని ఇవ్వాలని యోచిస్తోందట.
SILVER MEDAL 🥈
— Team India (@WeAreTeamIndia) August 8, 2024
A seasons best, and a second Olympic Medal for @Neeraj_chopra1 . What an athlete 👏🏽👏🏽#JeetKiAur | #Cheer4Bharat pic.twitter.com/lUHMFaPfUK