Neeraj Chopra Diamond League 2024: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలిసారి బరిలోకి దిగనున్నాడు. గురువారం లుసానె డైమండ్ లీగ్‌లో అతడు పోటీపడనున్నాడు. ఆగస్టు 23న అర్ధరాత్రి 12.15 గంటలకు అతడి ఈవెంట్ మొదలవుతుంది. రీసెంట్గా ముగిసిన విశ్వక్రీడల్లో నీరజ్ 89.45మీ త్రోతో సిల్వర్ మెడల్ సాధించాడు.
26 ఏళ్ల నీరజ్ తాను లుసానెలో పోటీపడే విషయం శనివారమే ధ్రువీకరించాడు. అతడు ఈసారైనా 90 మీటర్ల మార్కును అందుకుంటాడా అన్నది ఆసక్తికరం. ఈ సీజన్ డైమండ్ లీగ్ ఫైనల్స్ సెప్టెంబరు 14న బ్రసెల్స్‌లో జరుగుతాయి. ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే డైమండ్ లీగ్ మీటింగ్స్ సిరీస్‌లో నీరజ్ కనీసం టాప్-6లో నిలవాలి. అతడు ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. సెప్టెంబరు 5న జూరిచ్ మీట్ జరగనుంది.