ETV Bharat / technology

ఫ్యామిలీతో కలిసి టీవీ చూడలేకపోతున్నారా?- ఈ ఫీచర్​తో ఇకపై అడల్ట్ సీన్స్ భయం లేదుగా..!

జియోటీవీ ప్లస్​లో కొత్త బ్లర్​ ఫీచర్- ఇకపై ఫ్యామిలీతో కలిసి హాయిగా టీవీ చూసేయండిలా..!

JioTV+ New Feature to Hide Adult Scenes
JioTV+ New Feature to Hide Adult Scenes (Jio.com)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 7, 2024, 4:11 PM IST

Updated : Nov 7, 2024, 4:20 PM IST

JioTV+ New Feature to Hide Adult Scenes: కొంతమంది ఒంటరిగా మూవీ లేదా టీవీ షో చూసేందుకు ఇష్టపడతారు. మరికొందరికి కుటుంబంతో కలిసి చూడాలని అనిపిస్తుంటుంది. అయితే ప్రస్తుత కాలంలో కుటుంబంతో కలిసి సరదాగా టీవీ చూడాలంటే కాస్త ధైర్యం చేయాల్సిందే. ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి టీవీ చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా అడల్ట్ సీన్స్​ వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమయంలో చిన్న పిల్లలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా JioTV+ ఓ సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది.

జియో టీవీ ప్లస్ తీసుకొచ్చిన ఈ ఫీచర్​ సహాయంతో ఇకపై ఫ్యామిలీతో కలిసి హాయిగా టీవీ చూడొచ్చు. ఈ ఫీచర్ ఏఐ సహాయంతో టీవీ చూస్తున్న సమయంలో అడల్ట్ సీన్స్ వస్తే ఆటోమేటిక్​గా బ్లర్ చేసేస్తుంది. అంతేకాక 'AI సెన్సార్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ అవసరమైనప్పుడు ఆడియోను కూడా మ్యూట్ చేసేస్తుంది. కన్స్యూమర్ టెక్నాలజీ వెటరన్ రాజీవ్ మఖానీ ఈ ఫీచర్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలో చూపించారు.

రాజీవ్ మఖానీ చూపించిన వీడియో ప్రకారం.. R-రేటెడ్ లేదా 18+ కంటెంట్‌ని గుర్తించినప్పుడు ఈ ఫీచర్ మొత్తం స్క్రీన్​ను బ్లర్ చేసేస్తుంది. అంతేకాక అడల్ట్ సీన్స్ వచ్చినప్పుడు ఈ OTT యాప్ అవసరమైతే ఆడియోను కూడా సెన్సార్ చేసేస్తుంది.

ఏంటీ జియోటీవీ ప్లస్?: JioTV+ యాప్​ జియోటీవీ అప్లికేషన్​ నుంచి వేరుగా ఉంటుంది. జియోటీవీ అనేది మొబైల్ బేస్డ్ ప్లాట్​ఫారమ్. ఇది ఆండ్రాయిడ్, iOSలో అందుబాటులో ఉంటుంది. JioTV+ అనేది Jio సెట్-టాప్-బాక్స్‌లలో ముందే ఇన్‌స్టాల్ చేసి ఉన్న కంటెంట్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్. Android TV, Apple TV, Amazon Fire OSతో సహా ఇతర స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫారమ్‌లకు కూడా ఈ యాప్ అందుబాటులో ఉంటుంది.

అయితే ఇది JioFiber, JioAirFiber కస్టమర్లకు మాత్రమే పని చేస్తుంది. JioTV+ యాప్ Disney+ Hotstar, అమెజాన్ ప్రైమ్ వీడియో, SonyLIV, Zee5తో సహా 14 OTT ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కంటెంట్‌ను అందిస్తుంది. ఇది 800 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్స్​ను కూడా అందిస్తుంది. అవైలబుల్ OTT సబ్​స్క్రిప్షన్స్ మీ JioFiber ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది.

స్మార్ట్​ టీవీలో JioTV+ యాక్సెస్ చేసుకోవడం ఎలా?:

  • స్మార్ట్ టీవీలో JioTV+ని యాక్సెస్ చేసుకునేందుకు మొదట Smart TV యాప్ స్టోర్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీ JioFiber లేదా JioAirFiber అకౌంట్​తో రిజిస్టర్ చేసుకున్న మొబైల్​ నంబర్​తో లాగిన్ అవ్వాలి.
  • అనంతరం మీ ఫోన్‌కి పంపిన వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని ఎంటర్​ చేసిన వెంటనే అప్లికేషన్ పని చేయడం ప్రారంభమవుతుంది.

సుజుకి మోటార్ కార్పొరేషన్ మొట్టమొదటి ఈవీ- ఫస్ట్ లుక్​ మామూలుగా లేదుగా..!

బైక్ లవర్స్​కు గుడ్​న్యూస్- హీరో మోటోకార్ప్​ నుంచి నాలుగు కొత్త టూ-వీలర్స్

Last Updated : Nov 7, 2024, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.