Navdeep Singh Paralympics 2024 : పారా అథ్లెట్ నవదీప్ సింగ్ తాజాగా పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-41లో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. అయితే ఈ పతకం అతడికి అనూహ్యంగా దక్కింది. ఎఫ్-41లో భాగంగా జరిగిన ఈ గేమ్‌లో తొలుత ఇరాన్ అథ్లెట్ స్వర్ణం దక్కించుకోగా, భారత అథ్లెట్ నవదీప్ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు పడటం వల్ల ఆ స్వర్ణ పతకం కాస్త నవదీప్ సొంతమైంది. దీంతో జావెలిన్ త్రో ఎఫ్-41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నవదీప్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు మహిళల 200మీటర్ల టీ12 విభాగంలో సిమ్రన్ కాంస్య పతకం గెలుచుకుంది. ప్రస్తుతం భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది.
పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం - జావెలిన్ త్రోలో నవదీప్ రేర్ రికార్డ్!
Published : Sep 8, 2024, 6:50 AM IST
|Updated : Sep 8, 2024, 6:58 AM IST