Maharashtra CM Eknath Shinde Announces Reward To Teamindia : టీ20 ప్రపంచకప్ 2024 విజతగా నిలిచిన టీమ్ఇండియా ప్లేయర్స్‌ను సన్మానించి, వారికి రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే కూడా టీమ్ఇండియాకు రూ.11కోట్ల రివార్డును ప్రకటించారు. అలానే ముంబయికి చెందిన వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్‌ను ముఖ్యమంత్రి అధికారిక నివాసం వర్షలో జ్ఞాపికలను అందించి సన్మానించారు. వారితో కలిసి కాసేపు ముచ్చటించి ప్రపంచకప్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలోనే టీమ్ఇండియాకు నగదు బహుమతిని ప్రకటించారు. కాగా, 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచి గురువారం స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్‌ఇండియాకు దిల్లీ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం రోహిత్ సేన ప్రధాని మోదీని కలిసి ప్రపంచకప్ విశేషాలను పంచుకుంది.
టీమ్ఇండియాకు భారీ నజరానా ప్రకటించిన శిందే
Published : Jul 5, 2024, 6:43 PM IST