ETV Bharat / snippets

ఫాఫ్‌ డుప్లెసిస్‌కు గుడ్ బై - ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ!

Source ANI
kohli (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 4:04 PM IST

RCB IPL 2025 Players : ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లీ తిరిగి ఆ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్​లో ఆర్సీబీ జట్టు రిటైన్ చేసుకునే ప్లేయర్స్​ వివరాల గురించి అంచనా వేశాడు. "ఒకవేళ విరాట్ సారథ్య బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా లేకపోతే ఆ జట్టు మెగా వేలంలో కొత్త కెప్టెన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు గ్లేన్ మ్యాక్స్‌వెల్‌, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్‌లను వదిలేసే అవకాశముంది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను తీసుకోవచ్చు. రజత్ పటీదార్‌తో పాటు యశ్ దయాల్, సిరాజ్​లను రిటైన్ చేసుకునేందుకు పరిశీలించవచ్చు. వీరిని తప్ప మిగతా ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంత కన్నా ఎక్కువగా కావాలనుకుంటే రైట్ టూ మ్యాచ్ కింద తీసుకోవచ్చు." అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.