ICC Lost 160 Crore: 2024 టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌ను అమెరికాలో నిర్వహించడం వల్ల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు దాదాపు రూ.160 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అమెరికాలో క్రికెట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో అక్కడ టీ20 ప్రపంచకప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ఐసీసీకి ఊహించని షాక్ తగిలినట్లు సమాచారం. అమెరికాలో మూడు వేదికల్లో 10జట్ల మ్యాచ్‌లు జరిగాయి. అందులో భారత్- పాకిస్థాన్ పోరు, అమెరికా మ్యాచ్‌లకు మినహా మిగిలిన వాటికి స్టేడియాలకు పెద్దగా ఆడియెన్స్ రాలేదు. దీంతోపాటు చరిత్రలో తొలిసారి 20జట్లతో టోర్నీ నిర్వహించడం కూడా ఆర్థిక నష్టానికి ఒక కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొలంబోలో శుక్రవారం ప్రారంభం కానున్న ఐసీసీ వార్షిక సదస్సులో ఈ అంశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
USAలో వరల్డ్‌కప్- ICCకి రూ.160కోట్లు లాస్!
Published : Jul 18, 2024, 4:46 PM IST