ETV Bharat / snippets

UAEపై భారత్ గ్రాండ్ విక్టరీ- అభిషేక్ మెరుపు హాఫ్ సెంచరీ

Ind vs UAE Asia Cup
Ind vs UAE Asia Cup (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 23 hours ago

Ind vs UAE Asia Cup 2024: 2024 ఎమర్జింగ్ ఆసియా కప్​లో టీమ్ఇండియా ఎ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సోమవారం యూఏఈ జట్టుతో తలపడ్డ భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. యూఏఈ నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని భారత్ 55 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (58 పరుగులు; 24 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీతో రఫ్పాడించాడు. కెప్టెన్ తిలక్ వర్మ (21 పరుగులు) రాణించాడు. దీంతో స్వల్ప లక్ష్యాన్ని 10.5 ఓవర్లలోనే భారత్ ఘన విజయం సాధించింది.

అంతకుముందు టాస్ నెగ్గిన యూఏఈ బ్యాటింగ్ ఎంచుకుంది. 16.5 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. రసిక్ సలామ్, రమన్​దీప్ చెరో 3వికెట్లు పడగొట్టారు. యూఏఈ పతనాన్ని శాసించిన రసిక్ సలామ్​కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

కాగా, తాజా విజయంతో గ్రూప్​ బీలో టీమ్ఇండియా +2.460 రన్​రేట్​తో టాప్​లో కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.