ETV Bharat / snippets

జింబాబ్వేతో సిరీస్ - టీమ్ఇండియా జెర్సీపై ఒకే స్టార్ ఎందుకంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 9:49 PM IST

source Associated Press
Teamindia Jersy One Star (source Associated Press)

Teamindia Jersy One Star : ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన తొలిమ్యాచ్​లో టీమ్​ఇండియా 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. 116 పరుగుల లక్ష్యఛేదనలో 102 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ పోరులో టీమ్​ఇండియా జెర్సీపై ఒకే స్టార్‌ ఉంది. కానీ టీమ్​ఇండియా రెండో టీ20 వరల్డ్​కప్​ సాధించిన తర్వాత సంజూశాంసన్​ సోషల్​​మీడియాలో పోస్ట్ చేసిన జెర్సీపై రెండు స్టార్లు ఉన్నాయి. భారత ప్రపంచకప్​ జట్టు ప్రధానిమోదీని కలిసినప్పుడు కూడా జెర్సీలపై కూడా రెండుస్టార్లు ఉన్నాయి. ఎందుకంటే రెండుసార్లు టీ20 ప్రపంచకప్​ సాధించిన దానికి చిహ్నంగా ఈ రెండుస్టార్లు వేశారు. అయితే ప్రపంచకప్​ గెలవకముందే జింబాబ్వే పర్యటనకు యంగ్ టీమ్​ఇండియా వెళ్లింది. అందుకే వాళ్ల కోసం అప్పటికే సిద్ధం చేసిన జెర్సీలపై ఒక్క స్టార్ మాత్రమే ఉంది.కాబట్టి ఇకపై వచ్చే సిరీస్‌ నుంచి రెండు టీ20 ప్రపంచకప్‌లకు ప్రతీకగా రెండు స్టార్లు కలిగిన జెర్సీలను టీమ్ఇండియా ఆటగాళ్లు ధరించొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.