Rahul Gandhi On BJP : ప్రజలను భయపెట్టి, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేసిన తర్వాత ఛత్రపతి శివాజీ ముందుకు వచ్చి నమస్కరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. మహారాష్ట్రలోని కొల్హాపుర్లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరణకు ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసగించారు. సింధ్‌దుర్గ్‌లో ఉన్న ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనకు సంబంధించి బీజేపీపై ధ్వజమెత్తారు.
"ఛత్రపతి శివాజీ ప్రపంచానికి నాడు అందించిన సందేశం అందరికీ చెందుతుంది. ఛత్రపతి శివాజీ, షాహూ మహారాజ్ వంటి వ్యక్తులు లేకుంటే రాజ్యాంగం కూడా ఉండేది కాదు. ఛత్రపతి శివాజీ వ్యతిరేకంగా పోరాడిన, అదే సిద్ధాంతానికి నేడు కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతోంది. వారు(బీజేపీని ఉద్దేశించి) శివాజీ విగ్రహాన్ని ప్రారంభించిన కొన్ని రోజులకే కూలిపోయింది. ఒకవేళ శివాజీ విగ్రహాన్ని తయారు చేయాలనుకుంటే ముందు ఆయన సిద్ధాంతాన్ని కాపాడాలి. రామమందిరం, పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని అనుమతించలేదు. ఇది రాజకీయ పోరాటం కాదు. భావజాల పోరాటం' అని రాహుల్ గాంధీ అన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాల చరిత్రను పాఠశాలల్లో బోధించడం లేదని, ఆ చరిత్రను చెరిపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
VIDEO | Congress MP and Leader of Opposition in Lok Sabha Rahul Gandhi (@RahulGandhi) unveils a statue of Chhatrapati Shivaji Maharaj in #Kolhapur, Maharashtra.
— Press Trust of India (@PTI_News) October 5, 2024
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/bTOmGbXMMk
మరోవైపు, సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనంలో కూడా రాహుల్ పాల్గొన్నారు. రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేసేందుకు పార్లమెంటులో చట్టాలను సవరించేలా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి కృషిచేస్తాయని చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభల్లో కుల గణనపై చట్టం ఆమోదం పొందేలా చూస్తామన్న ఆయన, దానిని ఏ శక్తి అడ్డుకోలేదని పునరుద్ఘాటించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు మొట్టమొదటగా తీసుకోవాల్సిన చర్య ఏంటంటే రిజ్వర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని తెలిపారు. తాను ఇప్పటికే పలు మార్లు ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించానని చెప్పారు. అది ఆరంభం మాత్రమేనని, 50 శాతం పరిమితి ఇప్పుడు మన ముందున్న అవరోధమని వ్యాఖ్యానించారు రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేసేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి లోక్‌సభ, రాజ్యసభలో మారుస్తాయని హామీ ఇచ్చారు.