ETV Bharat / offbeat

టేస్టీ "పింక్ సాస్ పాస్తా"- ఇలా చేస్తే రెస్టారెంట్లకు వెళ్లాల్సిన అవసరం లేదు!! - How to Make Pink Sauce Pasta - HOW TO MAKE PINK SAUCE PASTA

Pink Sauce Pasta Recipe in Telugu: పిల్లలకు పాస్తా అంటే చాలా ఇష్టం. వీటిని రకరకాలుగా చేసుకుని తింటుంటారు. అయితే ఈ సారి పింక్ సాస్ పాస్తా ప్రిపేర్​ చేయండి.

How to Make Pink Sauce Pasta
How to Make Pink Sauce Pasta (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 5, 2024, 1:38 PM IST

Pink Sauce Pasta Recipe in Telugu: చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పాస్తాను ఇష్టంగా తింటారు. ఇక పాస్తాను కూడా రకరకాలుగా చేసుకుని తింటుంటారు. అయితే ఎంత టేస్టీగా ఉండే పాస్తా అయినా ఎప్పుడో ఒకే రీతిలో తినాలంటే బోర్​ కొట్టిద్ది. వెరైటీగా చేసుకుని తినాలనిపిస్తుంది. కానీ చేసుకోవడం రాదు. అయితే ఇకపై మీకు ఇలాంటి టెన్షన్ అవసరం లేకుండా.. వెరైటీగా పింక్ సాస్​ పాస్తా ప్రిపేర్​ చేసుకోండి. ఈ పాస్తాను ఎక్కువగా కెఫె, రెస్టారెంట్లలో చేస్తుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • 5 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె
  • ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వెన్న
  • 3 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు
  • ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము
  • పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు
  • 10 బేసిల్ ఆకులు (ఆప్షనల్)
  • 2 టమాటాలు
  • ఒక కప్పు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ క్యాప్సికం ముక్కలు
  • 5 పుట్టగొడుగు ముక్కలు
  • ఒక టేబుల్ స్పూన్ టమాటా కెచప్
  • అర టేబుల్ స్పూన్ ఎండ బెట్టిన పార్స్​లే
  • ఒక టేబుల్ స్పూన్ ఎండు మిరపకాయ గింజలు
  • రుచికి సరిపడా ఉప్పు
  • ఒక టీ స్పూన్ మిరియాల పొడి
  • 4 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న విత్తనాలు
  • ఒక కప్పు పాస్తా
  • 3 టేబుల్ స్పూన్ల వెన్న
  • 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి
  • ఒక కప్పు కాచిన పాలు
  • 2 చీజ్ ముక్కలు

తయారీ విధానం

  • ముందుగా స్టౌ ఆన్ చేసుకుని ఓ గిన్నెలో ఆలివ్ నూనె, వెన్న, వెల్లుల్లి, అల్లం తురుము వేసి వేయించుకోవాలి. (వెల్లుల్లి కాస్త వేగితే సరిపోతుంది)
  • ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, బెసిల్ ఆకులు వేసి వేయించుకోవాలి.
  • ఇప్పుడు టమాటాలను మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్​ను ఇందులో వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి.
  • అప్పుడు ఇందులో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ క్యాప్సికం ముక్కలు, పుట్టగొడుగులు వేసి సుమారు 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. (బ్రొకలీ, బేబీకార్న్ కూడా వేసుకోవచ్చు)
  • అనంతరం టమాటా కెచప్, ఎండబెట్టిన పార్స్​లే, ఎండు మిరపకాయ గింజలు, ఉప్పు, మిరియాల పొడి, మొక్కజొన్న విత్తనాలు వేసి కలపాలి.
  • ఆపైన పావు కప్పు నీరు పోసి దగ్గరపడేంత వరకు మీడియం ఫ్లేమ్​లో పెట్టి మగ్గించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే స్టౌ పై ఓ గిన్నెలో నీరు, ఉప్పు, ఆలివ్ నూనె వేసి బాగా మరిగించుకోవాలి.
  • ఇలా నీరు బాగా మరుగుతున్న సమయంలో పాస్తాను వేసుకుని 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్​లో ఉడికించుకోవాలి.
  • ఇదే సమయంలో మరో స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెను తీసుకుని అందులో వెన్నను వేసి వేయించుకోవాలి.
  • వెన్న కరిగిపోయే సమయంలోనే మైదా పిండిని వేసి కలపాలి. (వెన్న మొత్తం కరిగిపోయాక వేస్తే మైదా మాడిపోతుంది)
  • ఇందులో కాచిన పాలు కొద్దిగా కొద్దిగా పోస్తూ బాగా కలపాలి.
  • ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసుకున్న రెడ్ సాస్​ను వేసి కలపాలి.
  • ఆ తర్వాత ఉడికిన పాస్తా, అర కప్పు పాస్తాను ఉడికించిన నీరు ఇందులో వేసుకుని బాగా కలపాలి. (రుచి చూసి అవసరమైతే ఉప్పు వేసుకోవాలి)
  • ఇప్పుడు చీజ్​ ముక్కలను పాస్తాలో వేసి కాసేపు కలుపుకొని స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది.

బ్రెడ్ హల్వా చాలా సార్లు తిని ఉంటారు! - ఓ సారి రస్క్​తో ట్రై చేయండి - ఆ మధురం అద్భుతం!!

పదే పది నిమిషాల్లో పసందైన "పచ్చిమిర్చి వేపుడు" - వేడివేడి అన్నంలో నెయ్యితో తిన్నారంటే అమృతమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.