Paris Olympics 2024 Indias Chef de Mission : పారిస్ ఒలింపిక్స్ చెఫ్ దే మిషన్‌గా షూటర్ గగన్ నారంగ్ నియమితులయ్యారు. భారత ఒలింపిక్స్ సంఘం బాక్చర్ మేరీకోమ్ స్థానంలో నారంగ్‌ను ఎంపిక చేసింది. నారంగ్ గత ఒలింపిక్స్‌లో నాలుగు పథకాలు సాధించారు. అలానే ఈ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత జాతీయ పతాకాన్ని చేతపట్టి ముందు వరుసలో నడిచే గొప్ప అవకాశాన్ని పీవీ సింధు కూడా దక్కించుకుంది. భారత జట్టు తరఫున మహిళా ఫ్లాగ్ బేరర్‌గా సింధు వ్యవహరించనుంది. పురుషుల్లో శరత్ కమల్ కూడా ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష తెలిపారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్లు రాణిస్తారన్న నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, సింధు ఇప్పటి వరకు రెండు ఒలింపిక్స్ పతకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జులై 26న పారిస్ ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ చెఫ్ దే మిషన్‌గా గగన్ నారంగ్ - ఫ్లాగ్ బేరర్‌గా సింధు
Published : Jul 8, 2024, 9:28 PM IST
|Updated : Jul 8, 2024, 9:39 PM IST