2030 Winter Olympics: 2030 వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడానికి ఫ్రాన్స్ అర్హత సాధించింది. ఈ క్రీడలు ఫ్రాన్స్ ఆల్ప్స్ (పర్వత ప్రాంతాలు) Alpsలో జరగనున్నాయి. దీన్ని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (IOC)బుధవారం జరిగిన 142వ సెషన్లో ఆమోదించింది. అయితే ఇందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం అర్థిక పరమైన గ్యారెంటీ ఇచ్చిన తర్వాతే అక్కడ క్రీడల నిర్వహణ జరుగుతుందని ఐఓసీ షరతు విధించింది.
దీనిపై ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్ మాట్లాడారు. తమ దేశంపై మరోసారి విశ్వాసం ఉంచినందుకు IOCకి ధన్యవాదాలు తెలిపారు.'మన దేశంపై విశ్వాసం ఉంచిన IOCకి ధన్యవాదాలు. ఈ ఆతిథ్య హక్కులు పొందడానికి పనిచేసిన అధికారులకు అభినందనలు. ఈ క్రీడలు సమర్థంగా నిర్వహించేలా, నా తర్వాత వచ్చే ప్రధానిని కూడా అభ్యర్థిస్తా' అని మెక్రాన్ అన్నారు. కాగా, ఇదే మీటింగ్‌లో 2034 వింటర్ గేమ్స్‌కు సాల్ట్ లేక్ సిటీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నట్లు ఒలింపిక్ కమిటీ పేర్కొంది.