ETV Bharat / snippets

కడపలో 18 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 9:06 PM IST

Transport Minister Ramprasad Reddy
Transport Minister Ramprasad Reddy (ETV Bharat)

Transport Minister Ramprasad Reddy: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం 65 లక్షల మందికి పింఛన్లను పంపిణీ చేశామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఆర్టీసీకి గొప్ప గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో 18 ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభించారు. ఇదివరకే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో తరగతి ఆర్టీసీ బస్సులు వచ్చాయని, రానున్న రోజుల్లో మరో 4వేల కొత్త బస్సులను తీసుకొస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 15న పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాలు కూడా కల్పిస్తామని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.