ETV Bharat / snippets

నియోజకవర్గాల్లో ప్రొటోకాల్​ ఉల్లంఘనలు జరుగుతున్నాయి : బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు

BRS MLAS Fires On Congress Govt
BRS MLAS Fires On Congress Govt (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 4:36 PM IST

BRS MLAS Fires On Congress Govt : నియోజకవర్గాల్లో ప్రొటోకాల్​ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో ఇన్​ఛార్జ్​ల పేరిట కాంగ్రెస్ నేతలు పెత్తనం చలాయిస్తున్నారని బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడా ప్రొటోకాల్​ పాటించడం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.

విద్యాశాఖపై తనతో సమీక్షకు వచ్చిన ఎంఈఓలకు డీఈఓ నోటీసులు ఇచ్చారని, జెడ్పీలో నిలదీస్తే తనపై కేసుపెట్టారని ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డి మండిపడ్డారు. కల్యాణలక్ష్మి చెక్కుల విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని విమర్శించారు. తనపై కేసులు పెట్టినా భయపడేది లేదని కేసీఆర్​ శిష్యునిగా ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకూ సిద్ధమన్నారు. కేసీఆర్​పై ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే సంజయ్​ ఖండించారు. మంచిపనులు చేస్తే గొప్పవారు అవుతారు తప్ప కేసీఆర్​ను తిడితే కాలేరని సూచించారు. అధికారం ఉందని విర్రవీగొద్దని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.