ETV Bharat / snippets

'సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి'

BJP MLAS ON ISSUES IN TELANGANA
BJP MLAs Meeting (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 2:01 PM IST

BJPLP Meeting in Hyderabad : సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జరిగిన వరద బీభత్సానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పకుండా కేంద్రంపై నిందలు వేయడం సరికాదని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఎల్పీ కార్యాలయంలో పక్షనేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్​, రామ రావు పటేల్, రాకేశ్​ రెడ్డి, దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి హాజరయ్యారు.

ఎల్పీ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గొడెం నగేశ్​ హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రైతు రుణమాఫీ, ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌, హైడ్రా చర్యలపై సమావేశంలో చర్చించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.