UNICEF Delivers Polio Vaccines To Protect Children In Gaza Strip : గాజాలో 25 ఏళ్ల తర్వాత పోలియో కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో 12 లక్షల పోలియో టీకా డోసులను యూనిసెఫ్ పంపించింది. మొత్తంగా 6,40,000 మంది పాలస్తీనా చిన్నారులకు వ్యాక్సిన్స్ వేయాలని యూనిసెఫ్ నిర్ణయించింది.
ఇటీవల గాజాలోని రెండు నీటి కాలువల్లో పోలియో వైరస్‌ను గుర్తించారు. నాలుగు రోజుల క్రితం 10 నెలల చిన్నారికి పోలియో వైరస్ సోకినట్లు నిర్ధరించారు. దీనితో యూనిసెఫ్ అప్రమత్తమైంది. ఆగస్టు 31 నుంచి పోలియో టీకాలు వేయాలని నిర్ణయించింది. ఐరాస వాలంటీర్లతో సహా మొత్తం మూడు వేల మంది సిబ్బందితో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రణాళిక రచించింది. పసిపిల్లలు, వారి తల్లులు సురక్షితంగా వ్యాక్సినేషన్ సెంటర్‌కు చేరుకునేందుకు ఇజ్రాయెల్ కొంత కాలంపాటు గాజాపై దాడులకు విరామం ప్రకటించాలని ఐరాస కోరుతోంది.