India Comments On Pakistan in UNHRC: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ ఎప్పుడూ తమదేశంలో అంతర్భాగమేనని ఐరాసలో మరోసారి భారత్ పునరుద్ఘాటించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సెషన్‌లో ప్రసంగించిన భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి జమ్ముకశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లోని అంతర్భాగమేనని నొక్కి చెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా వస్తున్న కథనాలు కౌన్సిల్ విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని ఆయన చెప్పారు. భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఓ దేశం ప్రచారంలో నిమగ్నమైందని ఇది వారి విశ్వసనీయత లోపాన్ని సూచిస్తుందని పరోక్షంగా పాక్‌పై మండిపడ్డారు. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడంలో భారత్ నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. జమ్ముకశ్మీర్‌లో తాము చేపట్టే అభివృద్ధి పనుల వ్యయం, మీరు తెచ్చుకునే IMF బెయిల్ ఔట్ ప్యాకేజీ కంటే ఎక్కువేని అన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లు రెండు భారత్‌లోని విడదీయలేని భాగాలని క్షితిజ్ పునరుద్ఘాటించారు.
'J&K డెవలప్మెంట్ బడ్జెట్, మీరు IMFను అడిగే డబ్బుల కంటే రెట్టింపు'- ఐరాసలో పాక్ పరువు తీసిన ఇండియా!
Published : Sep 21, 2024, 12:54 PM IST