UK Stabbings : నార్త్-వెస్ట్ ఇంగ్లాండ్ సౌత్‌పోర్ట్‌లోని ఓ కమ్యూనిటీ సెంటర్‌లో ఓ ఉన్మాది చేసిన కత్తి దాడిలో ఇద్దరు చిన్నారులను మృతి చెందగా, మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వేల్స్‌కు చెందిన 17ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసి, అతడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సోమవారం ఉదయం హార్ట్ స్ట్రీట్‌లోని టౌన్ హార్ట్ సెంటర్‌లో జరిగిన డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు హాజరైనవారిపై ఉన్మాది దాడికి పాల్పడినట్లు తెలిసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. అయితే ఇది ఉగ్రదాడి అయి ఉండకపోవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సిఉంది. ఈ ఘటనపై బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లాతో పాటు ప్రధాని కీయర్ స్టార్మర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.