Terror Attack In Russia : రష్యాలో చర్చిలు, ప్రార్థనా మందిరాలు, పోలీసు అధికారులే లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. డాగేస్థాన్‌లో జరిగిన ఈ ఘటనలో 15మంది పోలీసులతో సహా అనేక మంది పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మఖచ్‌కల, డెర్బెంట్ నగరాల్లోని చర్చిలు, ప్రార్థనామందిరాలను మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ను చేపట్టి ఆరుగురు సాయుధులను మట్టుబెట్టాయి. ప్రస్తుతానికి ఆపరేషన్ ముగిసినట్లు రష్యా ‘జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటించింది. ఈ ఘటనను ఉగ్రవాదుల చర్యగా అభివర్ణించింది. డాగేస్థాన్‌లో జూన్ 24, 25, 26 సంతాప దినాలుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. దాడికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. అయితే ముస్లింలు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో గతంలోనూ సాయుధులు కాల్పులు జరిపారు.
చర్చిలు, పోలీస్ స్టేషన్లపై ఉగ్రదాడి- 15మందికి పైగా పోలీసులు, పౌరులు మృతి- ఆరుగురు ఉగ్రవాదులు హతం
Published : Jun 24, 2024, 8:27 AM IST