ETV Bharat / snippets

సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా- ఈసారి ఏమైందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 7:10 AM IST

Sunita Williams
Sunita Williams (Associated Press)

Sunita Williams Space Tour : బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక ప్రయోగం మరోసారి వాయిదాపడింది. ఇందులో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనం కావాల్సింది. ప్రయోగానికి సరిగ్గా 3 నిమిషాల 50 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ను కంప్యూటర్‌ వ్యవస్థ శనివారం నిలిపివేసింది. దీనికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు. డేటాను విశ్లేషిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రయోగం ఆదివారం జరిగే అవకాశం ఉంది. గత నెల 6న ఈ వ్యోమనౌక ప్రయోగానికి తొలి ప్రయత్నం జరిగింది. అయితే లీకేజీల సమస్య కారణంగా అది వాయిదా పడింది. నిజానికి ఈ యాత్ర ఎన్నో ఏళ్ల కిందట జరగాల్సింది. సాంకేతిక సమస్యల కారణంగా అది వాయిదా పడుతూ వస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.