Sunita Williams Space Journey : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, తోటి వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌లకు తమ రోదసి ప్రయాణాన్ని పూర్తి చేయడంలో పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. యాత్ర ముగించుకొని భూమిపైకి తిరిగిరావాల్సి ఉండగా వారి వ్యోమనౌకలో మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా వారి తిరుగు ప్రయాణం వాయిదా పడినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది.
రోదసియాత్ర ప్రారంభంలో సైతం వారు ప్రయాణించాల్సిన వ్యోమనౌకలో హీలియం విడుదలతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇప్పుడు వారు జూన్ 14న భూమికి తిరిగి రావాల్సి ఉండగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్య వెలుగుచూడటం వల్ల వాయిదా పడింది. జూన్ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ప్రకటించగా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. అన్ని కుదిరితే జులై 2న వీరు తిరుగుప్రయాణం ఉండొచ్చు.