ETV Bharat / snippets

షేక్ హసీనాకు మరో షాక్! దౌత్య పాస్​పోర్ట్​ను రద్దు చేసిన బంగ్లా ప్రభుత్వం

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 12:54 PM IST

Sheikh Hasina Passport Revoked
Sheikh Hasina Passport Revoked (Getty Images)

Sheikh Hasina Passport Revoked : మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం షాకిచ్చింది. హసీనాతో పాటు ఆమె పార్టీకి చెందిన మాజీ ఎంపీల దౌత్య పాస్​పోర్టులను రద్దు చేసినట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దౌత్య పాస్‌పోర్టు ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వీలు ఉంటుంది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల కారణంగా ప్రధాన పదవికి రాజీనామా చేసిన షేక్‌ హసీనా బంగ్లాదేశ్‌ను వీడి ఆగస్టు 5వ తేదీ నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఆందోళనల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో హసీనాపై పదుల సంఖ్యలో హత్య కేసులు నమోదయ్యాయి. హసీనా మొత్తంగా 44 కేసులను ఎదుర్కొంటున్నారు. షేక్‌ హసీనాను తమ దేశానికి అప్పగించాలని ఇప్పటికే బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(BNP) భారత్‌ను డిమాండ్‌ చేసింది. బంగ్లాదేశ్‌ విజయాన్ని అడ్డుకునేందుకు భారత్‌ నుంచి ఆమె కుట్ర చేస్తున్నారని ఆరోపించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.