Congo Boat Accident : కాంగోలో ఓ పడవ బోల్తా పడిన ఘటనలో 80మందికి పైగా ప్రయాణికులు మరణించారు. రాజధాని కిన్షాకు సమీపంలోని ఓ నదిలో పడవ బోల్తా పడినట్లు అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెక్డి వెల్లడించారు. ప్రమాద సమయంలో పడవలో సుమారు 270 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. ఇంజిన్ ఫెయిల్యూర్ కావడం వల్లే పడవ మునిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇందులో 185 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, మరో 80 మందికి పైగా మరణించారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద పడవ ప్రమాదమని తెలిపారు.
మంగళవారం యెమెన్ తీరంలో వలసదారుల పడవ మునిగిపోయిన ప్రమాదంలో 49మంది దుర్మరణం పాలయ్యారు. మరో 140మంది గల్లంతయ్యారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ మంగళవారం వెల్లడించింది. సోమాలియా, ఇథియోపియాలకు చెందిన 260మందితో ఉత్తర సోమాలియా తీరం నుంచి బయలుదేరిన పడవ సోమవారం యెమెన్ దక్షిణ తీరంలో మునిగిపోయిందని పేర్కొంది.