Russia Declares An Emergency In Kursk : ఉక్రెయిన్ సైనికుల దాడులతో నైరుతి రష్యాలోని కస్క్ ప్రాంతంలో పరిస్థితులు భీకరంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కస్క్‌లో అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అదనపు బలగాలను తరలిస్తున్నట్లు తెలిపింది.
వందల మంది కీవ్ సైనికులు నాలుగు రోజుల కిందట సరిహద్దును దాటి వచ్చి రష్యాలోని కస్క్‌లో బీభత్సం సృష్టించారు. వారిలో దాదాపు వంద మందిని ఇప్పటికే తాము హతమార్చినట్లు మాస్కో ప్రకటించింది. ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని లిపెట్క్స్ ప్రాంతంపై విరుచుకుపడ్డాయి. దీనికి ప్రతికారంగా రష్యన్ బలగాలు ఉక్రెయిన్‌పై వరుస క్షిపణలతో దాడులు చేశాయి. ఓ షాపింగ్ మాల్‌పై రష్య క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో 14 మంది మృతి చెందగా, మరో 44 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.