Qatar Israel-Hamas Mediation Talks : ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్, తాము ఆ బాధ్యతల నుంచి వైదొలిగినట్లు వస్తున్న వార్తలను ఖండించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ప్రస్తుతం సంప్రదింపులు స్తంభించాయని, అంతేకాని తాము మధ్యవర్తిత్వం నుంచి వైదొలగలేదని స్పష్టం చేస్తూ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఖతార్ విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది. యుద్ధాన్ని ఆపడానికి, మనవతా విపత్తులు నిలువరించడానికి అన్ని వర్గాలు యత్నిస్తే, నిజాయతీగా వ్యవహరిస్తే తాము మధ్యవర్తిత్వ యత్నాలను పునరుద్ధరిస్తామని ఖతార్ స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వం నుంచి ఖతార్ వైదొలిగినట్లు, దోహాలో హమాస్ కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఖతార్ ఈ మేరకు స్పందించింది. దోహాలోని హమాస్ కార్యాలయాన్ని బహిష్కరిస్తున్నట్లు వచ్చిన కథనాల్లోనూ నిజం లేదని తెలిపింది. సంబంధిత అధికారులతో సంప్రదించేందుకు బందీలు, ఖైదీల మార్పిడితో పాటు గాజాలో శాంతి పునరుద్ధరణకు ఆ కార్యాలయం దోహదపడుతుందని వెల్లడించింది.
ఆ వార్తలు అవాస్తవం - ఇజ్రాయెల్, హమాస్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తాం: ఖతార్
Published : Nov 10, 2024, 3:37 PM IST