Bus Accident in Pakistan : పాకిస్థాన్‌లో ప్రమాదవశాత్తు బస్సు అదుపు తప్పి లోయలో పడ్డ ఘటనలో 28మంది మృతి చెందారు. సుమారు 22 మందిపైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు టైరు పేలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు తెలిపారు. బలూచిస్థాన్‌లోని టుర్బాట్ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్సు వాషుక్ టౌక్ సమీపంలో ప్రమాదానికి గురైంది.
లోయలో పడ్డ బస్సు- 28మంది మృతి- మరో 22మందికిపైగా!
Published : May 29, 2024, 12:10 PM IST