ETV Bharat / snippets

ఆయిల్ ట్యాంకర్​, ట్రక్కు ఢీ - మంటల్లో చిక్కుకుని 48 మంది స్పాట్ డెడ్

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 7:01 AM IST

Updated : Sep 9, 2024, 7:52 AM IST

Nigeria Road Accident
Nigeria Road Accident (ANI (Representative Image))

Nigeria Road Accident : నైజీరియాలో ఓ ఆయిల్ ట్యాంకర్, ట్రక్కు ఢీ కొని 48 మంది మరణించారు. నార్త్‌ సెంట్రల్‌ నైగర్‌ స్టేట్​లోని అగాయ్‌ ప్రాంతంలో ఓ ఆయిల్ ట్యాంకర్​ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడం వల్ల భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 48 మంది సజీవదహనమయ్యారని నైజీరియా ఎమర్జెన్సీ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఘటనలో ఆయిల్​ ట్యాంకర్​లో ఉన్న 50 పశువులు కూడా మరణించాయని పేర్కొంది. మృతులకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్లు డైరెక్టర్ జనరల్​ ఆఫ్​ నైజీరియా స్టేట్​ మేనేజ్​మెంట్​ ఏజెన్సీ అబ్లుల్లాహి బాబా-అరబ్​ తెలిపారు.

Last Updated : Sep 9, 2024, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.