ETV Bharat / snippets

నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం- మోదీ శుభాకాంక్షలు

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 12:12 PM IST

Updated : Jul 15, 2024, 12:19 PM IST

Nepal New PM Oath Ceremony
Nepal New PM Oath Ceremony (ANI)

Nepal New PM Oath : నేపాల్‌ ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలి నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. తీవ్రమైన రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న నేపాల్​లో కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైన ఓలీని దేశ అధ్యక్షుడు రాంచంద్రపాడెల్ ప్రధానిగా నియమించారు. గత శుక్రవారం మాజీ ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్‌ పార్టీకి మద్దతిచ్చింది. ఫలితంగా ఓలీ నాలుగోసారి ప్రధాని పీఠం ఎక్కేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు ఓలీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం చేయడానికి కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. కేపీ ఓలీకి కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలిపింది. రెండు దేశాలు కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నామని పేర్కొంది.

Last Updated : Jul 15, 2024, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.